Neeraj: నా నెక్ట్స్‌ టార్గెట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్పే: నీరజ్‌చోప్రా

Neeraj: నా నెక్ట్స్‌ టార్గెట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్పే: నీరజ్‌చోప్రా

లాసన్ డైమండ్ లీగ్ ఈవెంట్లో 87.66 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన భారత ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌లో వరుసగా 2వ సారి మొదటి స్థానంలో నిలిచాడు. దీనికి ముందు దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌ మొదటి ఈవెంట్‌లోనూ మొదటిస్థానంలో నిలిచాడు. అయితే గాయం ఇంకా అతడిని వేధిస్తోంది. గాయం కారణంగా ఈ ఈవెంట్‌కి ముందు జరిగిన పలు పోటీల్లో పాల్గొనలేదు. లాసన్ ఈవెంట్‌కి ముందు కూడా గాయంతోనే ఉన్నాడు. గాయంతోనే అందులో పాల్గొని సత్తా చాటాడు.అయితే ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి, వచ్చే నెలలో జరగనున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌పై ఫోకస్ పెట్టినట్టు వెల్లడించాడు. లాసన్ ఈవెంట్ అనంతరం పలు విషయాలపై మాట్లాడాడు.


టోర్నీ సన్నద్ధతపై నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. టోర్నీలో నా 100 శాతం ప్రదర్శన ఇవ్వాలనుకున్నాను. అదే సమయంలో నా గాయం, ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టానన్నాడు. ప్రధాన ఆటకి ముందు ట్రైనింగ్‌లో వాతావరణంగా నాకు అనకూలంగా అన్పించలేదు. అయినా నా శాయశక్తులా ప్రయత్నించాలని అనుకున్నానని వెల్లడించాడు.

అయితే మొదటి 4 ప్రయత్నాల్లో నీరజ్ ప్రయత్నాలు ఫలించలేదు. 5వ ప్రయత్నంలోనే తను ఎక్కువ దూరం విసరగలిగాడు.

"2, 3 త్రోల తర్వాతే నేను పోటీలో నిలవగలను అని ఆత్మవిశ్వాసం వచ్చింది. ప్రతీ ప్రయత్నంలో ఎక్కువ దూరం విసరాలనే ఆలోచించాను. రన్‌ అప్‌ వేగం పెంచమని కోచ్‌ సలహా ఇవ్వడంతో ఆ విధంగా ప్రయత్నించడంతో విజయం నా సొంతమైంది" అని వెల్లడించాడు.

ప్రతీ ఈవెంట్‌లో మొదటి లేదా రెండు త్రోలు విసరడంలోనే నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నేను ఫోకస్‌ పెడతానన్నాడు. అయినప్పటికీ చివరి ప్రయత్నాల్లో కూడా నా శక్తిని ధారపోయడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతాను అన్నాడు. ఈ విధానమే లాసన్‌లో నాకు విజయం సాధించిపెట్టిందన్నాడు.


ఆగస్ట్‌లో జరగనున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌పై స్పందిస్తూ.. ఇప్పటిదాకా నా సన్నద్ధత బాగానే ఉంది. కానీ గాయం ఎప్పుడు తిరగబెడుతుందోనన్న అనుమానం కూడా ఉందన్నాడు. సాయ్(SAI), టాప్స్(TOPS), JSW స్పోర్ట్స్ వాళ్లు నాకు చాలా మద్ధతుగా నిలుస్తూ నేను ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా చూస్తున్నారు. వచ్చే బిజీ షెడ్యూల్‌లో వారి సలహాలు, సూచనలు చాలా ఉపయోగపడతాయని వెల్లడించాడు. గాయం లేకుండా ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. మానసికంగా, శారీరకంగా అత్యుత్తమంగా పోటీకి రెడీ కావాలనకుంటున్నాను. నా టెక్నిక్‌ని కూడా మెరుగుపరుకోడానికి ప్రయత్నిస్తున్నాను" అని వెల్లడించాడు.

డైమండ్‌ లీగ్‌ సీజన్‌లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో కూడా నీరజ్ పాల్గొననున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story