Neeraj Chopra: ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు హీరోగా ఆఫర్..
Neeraj Chopra: కొంతమంది ఆటగాళ్లు.. ఆ ఆటకే గుర్తింపు తెస్తుంటారు. ఒలింపిక్స్‌లో ఎన్నో రకాల ఆటలు ఉంటాయి. కానీ ఇండియన్ ఎవరైనా అందులో పతకం సాధించేవరకు దాని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అలా జావెలిన్ థ్రోను మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు నీరజ్ చోప్రా పేరు స్టోర్స్‌లో సువర్ణాక్షరాలతో రాసి ఉంది. ఈ ఆటగాడి గురించి చాలామందికి తెలియని పలు ఆసక్తికర విషయాలను తానే స్వయంగా పంచుకున్నాడు.
జావెలిన్ థ్రోలో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత వెంటనే నీరజ్ ఓ స్టార్ అయిపోయాడు. ఈ 24 ఏళ్ల ఆటగాడు ఇంతకు ముందు కూడా పలు బ్రాండ్ యాడ్స్ కోసం పనిచేశాడు. కానీ ఒలింపిక్స్‌లో గెలుపు తర్వాత నీరజ్‌కు వచ్చే ఆఫర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. దీంతో పాటు తాను చార్జ్ చేసే మొత్తం గణనీయంగా కూడా పెరిగింది.
ఏదైనా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం కోసం సంవత్సరానికి ఏకంగా రూ.4 కోట్లు చార్జ్ చేస్తున్నాడట నీరజ్ చోప్రా. అది కూడా ఆ బ్రాండ్‌ను బట్టి పారితోషికం మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందట. ఒక్కొక్కసారి బ్రాండ్ ఎంత పెద్దది అయినా కూడా కొన్ని బ్రాండ్స్ చేయడానికి నీరజ్ ఇష్టపడడని తన టీమ్ చెప్తోంది. ఇప్పటివరకు చాలా ఆల్కహాల్, లోదుస్తులు బ్రాండ్స్‌కు నీరజ్ నో చెప్పాడట కూడా.
ఇప్పటికే నీరజ్ చోప్రా బయోపిక్ కోసం ఎంతోమంది మేకర్స్ ముందుకొచ్చారు. కానీ 24 ఏళ్లలో తాను పెద్దగా సాధించింది ఏమీ లేదని, ఇప్పుడు బయోపిక్ వద్దు అని అన్నింటిని రిజెక్ట్ చేస్తూ వచ్చాడట. అంతే కాకుండా తననే హీరోగా నటించమంటూ మూడు పెద్ద నిర్మాణ సంస్థలు ఆఫర్ ఇవ్వగా నీరజ్ ఒప్పుకోలేదని సమాచారం. ప్రస్తుతం నీరజ్ చోప్రా తన ఆటపైనే ఫుల్ ఫోకస్ పెట్టి మరిన్ని రికార్డులు సాధించాలని అనుకుంటున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com