US Open 2023: జకోవిచ్‌దే టైటిల్

US Open 2023: జకోవిచ్‌దే  టైటిల్
రష్యా క్రీడాకారుడు మెద్వెదెవ్‌పై ఘన విజయం

పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సెర్బియన్ యోధుడు, స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్ ను చిత్తుచేసి 24వ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెన్నిస్ లో ఓవరాల్ గా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ ను సమం చేశాడు. ఫైనల్ ఫోరు హోరాహోరీగా సాగుతుందని భావించినప్పటికీ 6-3, 7-6, 7-5, 6-3 తేడాతో జకోవిచ్ వరుస సెట్లలో మూడో సీడ్ ఆటగాడు మెద్వెదెవ్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచాడు.


సెర్బియా టెన్నిస్ లెజెండ్ నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ 2023 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రష్యా క్రీడాకారుడు మెద్వెదెవ్‌ను చిత్తుగా ఓడించి 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. దీంతో, టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మార్గరెట్ కోర్టు(24) రికార్డును సమం చేశాడు. సెర్బియాకు చెందిన 36 ఏళ్ల జొకోవిచ్, సెరెనా విలియమ్స్ ముందు ఒక ప్రధాన సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 1968లో ప్రారంభమైన ఓపెన్ ఎరాలో 24 గెలిచిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.2021లో ఇదే యూఎస్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ ను ఓడించి తొలిసారిగా గ్రాండ్ స్లామ్ ను ఒడిసిపట్టిన మెద్వెదెవ్ ఈ సారి మాత్రం బోల్తా పడ్డాడు. ఈ విజయంతో జకోవిచ్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. నాటి యుఎస్ ఓపెన్‌లో మెద్వెదెవ్ చేతిలో పరాజయం పాలైన జకోవిచ్ ఈసారి టోర్నమెంట్‌లో అతడిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. తొలి సెట్‌‌లో 6-3 తేడాతో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. ఈ ఏడాది జకోవిచ్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ గెలుపొందగా వింబుల్డన్‌లో మాత్రం యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓటమి చవిచూశాడు.


న్యూ యార్క్‌లో ఇది జకోవిచ్ నాల్గవ ఛాంపియన్‌షిప్, కోవిడ్-19కి సమయంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోనందున నిరుడు పోటీలో పాల్గొనలేకపోయాడు. పురుషుల స్లామ్ జాబితాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 10 ట్రోఫీలు, వింబుల్డన్ లో ఏడు, ఫ్రెంచ్ ఓపెన్ లో మూడు ట్రోఫీలు అతని ఖాతాలో ఉన్నాయి. తుంటి సంబంధిత శస్త్రచికిత్స వల్ల ఆటకు జనవరి నుండి దూరంగా ఉన్న రాఫెల్ నాదల్ 22తో తదుపరి స్థానంలో ఉన్నాడు. ఏడాది క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్ తో ముగించాడు. న్యూ యార్క్‌లో ఇది జకోవిచ్ నాల్గవ ఛాంపియన్‌షిప్, కోవిడ్-19కి సమయంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోనందున నిరుడు పోటీలో పాల్గొనలేకపోయాడు. పురుషుల స్లామ్ జాబితాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 10 ట్రోఫీలు, వింబుల్డన్ లో ఏడు, ఫ్రెంచ్ ఓపెన్ లో మూడు ట్రోఫీలు అతని ఖాతాలో ఉన్నాయి. తుంటి సంబంధిత శస్త్రచికిత్స వల్ల ఆటకు జనవరి నుండి దూరంగా ఉన్న రాఫెల్ నాదల్ 22తో తదుపరి స్థానంలో ఉన్నాడు. ఏడాది క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్ తో ముగించాడు.


Tags

Next Story