Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. మరోసారి ప్రపంచ వేదికపై ఘనత..
Neeraj Chopra: భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచవేదికపై మెరిశాడు. ఫిన్లాండ్ కోర్తానే గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్.. బంగారు పథకం సాధించాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్, గ్రెనెడా దేశస్థుడు అండర్సన్ పీటర్స్‌ను వెనక్కినెట్టి ఈ పతకం సాధించడం విశేషం. తొలి ప్రయత్నంలో రికార్డు దూరం విసిరిన నీరజ్.. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు.
అప్పటికే పతకం ఖాయమైన నేపథ్యంలో మిగిలిన మూడు ప్రయత్నాలు చేయకుండానే విరమించుకున్నాడు. వర్ష పరిస్థితుల కారణంగా బల్లెం విసరడం ఆటగాళ్లకు కష్టమైంది. ఈ క్రమంలోనే మూడో ప్రయత్నంలో నీరజ్ పట్టు కోల్పోయి జారాడు. ట్రినిడాడ్‌కు చెందిన వాల్కట్ కెషోర్న్ బల్లెంను 86.64 మీటర్లు విసిరి రెండోస్థానంలో నిలవగా.. 84.75 మీటర్లు విసిరిన అండర్సన్ పీటర్స్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com