Qinwen Zheng: అబ్బాయిని అయ్యుంటే బాగుండేది.. క్రీడాకారిణి హార్ట్ టచింగ్ కామెంట్స్..
Qinwen Zheng: క్రీడాకారులు ఎలాంటి పర్సనల్ సమస్యతో బాధపడుతున్నా కూడా మైదానంలో అడుగుపెట్టగానే అన్నీ మర్చిపోవాలి. దేశం కోసం ఆడుతున్నామన్న ధ్యాస మాత్రమే మనసులో ఉండాలి. కానీ కొన్నిసార్లు ఇది సాధ్యపడదు. క్రీడాకారుల దృష్ణిని మళ్లించేవి కూడా చాలా జరుగుతుంటాయి. అలాంటి సమయంలోనే వారు ఓటమిపాలవుతారు. అలా ఓటమిని ఎదుర్కున్న టెన్నిస్ చైనా క్రీడాకారిణి కిన్వెన్ జెంగ్ చేసిన కామెంట్స్ చాలా హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి.
ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ-క్వార్టర్స్‌లో కిన్వెన్ జెంగ్.. ప్రపంచ నెంబర్.1 క్రీడాకారిణి ఇగ స్వియాటెక్‌తో తలపడింది. ఆట మొదలైన తర్వాత మొదటి రౌండ్‌లో ఇగను ఓడించింది కిన్వెన్. ఇది తనకు మంచి స్టార్ట్ అనుకున్నారంతా. కానీ రెండో రౌండ్ ప్రారంభమయ్యేసరికి విపరీతంగా కడుపు నొప్పి రావడంతో కిన్వెన్.. ఆ తర్వాత రెండు రౌండ్లు ఓడిపోయింది. ఇదంతా పీరియడ్స్ వల్లే అని తను మీడియా సమావేశంలో పరోక్షంగా తెలిపింది.
సహజంగా ఆడవారికి ఎదురయ్యే సమస్యలే అని కిన్వెన్ తన పీరియడ్స్ గురించి పరోక్షంగా తెలిపింది. మొదటిరోజు తనకు భరించలేనంత నొప్పి ఉంటుందని తెలిపింది. అందుకే టెన్నిస్ కోర్టులో తానొక అబ్బాయిగా ఉండుంటే బాగుండేదని, అప్పుడు ఈ సమస్య ఉండేది కాదని అభిప్రాయపడింది. ఒకవేళ కడుపు నొప్పి లేకపోయింటే తాను ఇంకా చురుగ్గా పాల్గనేదాన్ని అని చెప్పింది కిన్వెన్. తనకు ఎదురైన పరిస్థితి చూస్తుంటే తన మీద తనకే జాలి కలుగుతుందని హార్ట్ టచింగ్ కామెంట్స్ చేసింది కిన్వెన్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com