ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత నాదల్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత నాదల్‌

మట్టి కోర్టులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు రఫెల్‌ నాదెల్. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో గ్రాండ్‌ విక్టరీ సాధించాడు. నొవాక్‌ జకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయంసాధించి టైటిల్ గెలిచాడు. తొలిసెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్‌ రెండో సెట్‌లోనూ జకోవిచ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక హోరాహోరీగా సాగిన మూడో సెట్‌లోనూ పైచేయి సాధించి టైటిల్‌ సాధించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్ చేతిలో జకోవిచ్‌ మూడుసార్లు ఓటమి చవిచూశాడు. ఇక ఈ విజయంతో నాదల్‌ 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్‌ సరసన నిలిచాడు.

Tags

Read MoreRead Less
Next Story