Serena Williams: ఆటకు గుడ్‌బై చెప్పిన టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్..
Serena Williams: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్(41) రిటైర్మెంట్ ప్రకటించింది. యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్తున్నట్టు ప్రకటన చేసింది. 'టెన్నిస్‌కు దూరమవడం మార్పు మాత్రమే.. రిటైర్మెంట్ మాట నాకు నచ్చదు.. ఇకపై కుటుంబం, వ్యాపారంపై పూర్తిగా దృష్టి పెడుతున్నా' అంటూ సెరెనా చెప్పుకొచ్చింది. 1995లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా సెరెనా సంచలనం సృష్టించింది.
కెరీర్‌లో సింగిల్స్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది సెరెనా. ఆస్ట్రేలియా ఓపెన్ 7 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ 3 సార్లు.. వింబుల్డన్ 7 సార్లు, యూఎస్ ఓపెన్ 6 సార్లు గెలిచిన సెరెనా కెరీర్ మొత్తంలో సింగిల్స్‌లో 73 పతకాలు సొంతం చేసుకుంది. 84.8 సక్సెస్ రేట్‌తో టెన్నిస్‌లో తనదైన ముద్రవేసిన సెరెనా.. 14 సార్లు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌తోనూ రికార్డ్ సాధించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com