Sports: సానియాతో చిల్ అవుతోన్న ఫరాఖాన్

Sports: సానియాతో చిల్ అవుతోన్న ఫరాఖాన్
సానియా రిటైర్మెంట్ ను సెలబ్రేట్ చేసుకుంటోన్న బెస్ట్ ఫ్రెండ్స్; సనీ స్టార్స్ నుంచి స్పోర్ట్ స్టార్స్ వరకూ

హైదరాబాద్ కా షాన్ సానియా మిర్జా తన రెండు దశాబ్దాల సుధీర్ఘమైన, ప్రతిష్ఠాత్మకమైన టెన్నిస్ కెరీర్ తెరదించిన సంగతి తెలిసిందే. ఆమె రిటైర్మెంట్ హైదారాబాదీలను మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉద్వేగానికి గురిచేసింది. సానియా శ్రేయోభిలాషులు ఆమె రిటైర్మెంట్ పార్టీకి హాజరయ్యి ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇక సినీ ఫీల్డ్ లోనూ అత్యంత ఆప్తులను సంపాదించుకున్న సానియా బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్ కు అత్యంత సన్నిహితురాలన్న సంగతి తెలిసిందే. సానియా రిటైర్మెంట్ తరుణంలో ఆమెను కలవడానికి వచ్చింది ఫరా. ఈ సంద్భంగా ఇద్దరూ మంచంపై పడుకుని చిల్ అవుతున్న ఫొటోను ఆమె షేర్ చేసింది. రిటైర్మెంట్ తరువాత ఛాంపియన్లు ఇలానే రిలాక్స్ అవుతారంటూ ట్వీట్ చేసింది. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఏమైనా సానియా ఇకపై కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతుందేమో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story