Naina Jaiswal: క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు వేధింపులు.. ఫిర్యాదు చేసిన తండ్రి..
Naina Jaiswal: సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా యువతులు, మహిళలకు నిత్యం వేధింపులకు గురవుతున్నారు. అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు వేధింపులు తప్పలేదు. సోషల్ మీడియా వేదికగా ఆకతాయిలు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. శ్రీకాంత్ అనే యువకుడు గత కొంతకాలంగా ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నట్లు నైనా కుటుంబ సభ్యులు తెలిపారు.
సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్న శ్రీకాంత్‌ను గతంలో హెచ్చరించినా అతని తీరుమారలేదు. గతంలో సిద్దిపేట పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా మారోసారి నైనా జైశ్వాల్ వేధింపులకు గురిచేయడంతో ఆమెతండ్రి అశ్విన్ జైశ్వాల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదుచేశారు. దీంతో నిందితున్ని అరెస్టుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ వేధింపులవల్ల తమ కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురైందన్నారు నైనా తండ్రి అశ్విన్ జైశ్వాల్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com