Global Chess League: మొట్టమొదటి చెస్ లీగ్‌ విజేతగా త్రివేణి కింగ్స్

Global Chess League: మొట్టమొదటి చెస్ లీగ్‌ విజేతగా త్రివేణి కింగ్స్
పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న త్రివేణి జట్టు టైటిల్ కొట్టింది.


మొట్టమొదటి గ్లోబల్ చెస్ లీగ్‌(GSL) విజేతగా త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ అవతరించింది. దుబాయ్‌లో జరిగిన ఈ తొలి టోర్నీలో ఫైనల్లో ముంబయ్ మాస్టర్స్‌ జట్టుని ఓడించింది. తీవ్రమైన ఒత్తిడి మధ్య సడెన్ డెత్ మ్యాచ్‌లో యువ ఆటగాడు డానిష్ గ్రాండ్ మాస్టర్ జోనాస్ జెర్రె, ముంబాయి మాస్టర్స్ ప్లేయర్ జావోఖిర్ సిందరోవ్‌ను ఓడించాడు. పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంటూ వచ్చిన త్రివేణి కింగ్స్ జట్టు టైటిల్ ఎగరేసుకుపోవడం విశేషం.


డబుల్ రౌండ్-రాబిన్ టోర్నమెంట్‌ 10 రౌండ్లలో జరిగింది. తర్వాత మొదటి రెండు స్థానాల్లో ఉన్న ముంబాయి మాస్టర్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్లు ఫైనల్‌కి చేరాయి. ఫైనల్‌లో జరిగిన రెండు ర్యాపిడ్ రౌండ్‌లు కూడా డ్రాగా ముగిశాయి.

ఆద్యతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విన్నర్‌ని 3 దశల టై బ్రేక్‌ ద్వారా నిర్ణయించారు. రెండు ర్యాపిడ్‌ రౌండ్లు, మరో బ్లిట్జ్ రౌండ్లు కూడా డ్రాగా ముగిసాయి. అయినప్పటికీ విన్నర్‌ ఎవరో తేల్చలేకపోయారు. దీంతో సడెన్ డెత్ మ్యాచ్ అనివార్యమయింది. 3 నిమిషాల టైమ్ లిమిట్‌తో బ్లిట్జ్ రౌండ్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇరు జట్ల నుంచి హారిక ద్రోణవల్లి, సారా ఖడెమ్ మధ్య, అలెగ్జాండర్ గ్రిష్‌చుక్, యాంగి మధ్య, కోనేరు హంపీ, కాటెరినా లగ్నోల మధ్య జరిగిన మ్యాచ్‌లు కూడా డ్రాగా ముగిశాయి. దీంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. నాల్గొవ రౌండ్‌లో కాంటినెంటల్ ఆటగాడు జోనాస్, సిందరోవ్‌ల మధ్య పోటీ జరిగింది. ఇది కూడా డ్రాగా ముగుస్తుందనుకున్న సమయంలో సిందరోవ్‌కు జోనాస్ చెక్‌మేట్ పెట్టడంతో టైటిల్ వారి సొంతమైంది. జోనాస్‌ని ఈ టోర్నమెంట్‌లో 4 సార్లు ఓడించాడు. దీంతో జోనాస్ గెలుపు కష్టమే అనుకున్నారు. కానీ అవసరమైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టుకు మరపురాని విజయం సొంతం చేశాడు.



త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ టోర్నీ ఆరంభంలో ఆడిన 6 మ్యాచుల్లో కేవలం రెండే గెలిచి లీగ్‌ పట్టికలో చివరి స్థానంలో ఉండేది. కానీ ఆటగాళ్ల అద్భుత ఆటతో ఇప్పుడు ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోయి చరిత్ర సృష్టించారు. ముంబయి జట్టులో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక వంటి క్రీడాకారిణులు ఉన్నారు.

Read MoreRead Less
Next Story