వింబుల్డన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం

వింబుల్డన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం

Wimbledon 

Wimbledon 2021: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మ్యాచ్‌ ఫికింగ్‌ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల‌పై విచార‌ణ జ‌రుగుతోంది.

Wimbledon 2021: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మ్యాచ్‌ ఫికింగ్‌ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల‌పై విచార‌ణ జ‌రుగుతోంది. ఒక సింగిల్స్ మ్యాచ్‌, మ‌రో డ‌బుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అధిక బెట్టింగ్ న‌మూనాల‌ను గుర్తించిన అధికారులు.. ఆ రెండు మ్యాచ్‌ల‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. కొన్ని బెట్టింగ్ సంస్థలు కూడా ఈ మ్యాచ్‌ల‌పై జ‌రిగిన బెట్టింగ్‌ల‌పై సందేహాలు వ్యక్తం చేశాయి. మెన్స్ డ‌బుల్స్ ఫ‌స్ట్ రౌండ్ మ్యాచ్ ఈ అనుమానాస్పద లిస్ట్‌లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో ఈ మ్యాచ్ ఫేవ‌రెట్ జోడీ ఓడిపోయిన‌ట్లు ప‌లు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి.

ఈ జోడీ తొలి సెట్ గెలిచి త‌ర్వాతి రెండు సెట్ల‌ను ఓడిపోయింది. ఇక మ‌రొక‌టి జ‌ర్మన్ ప్లేయ‌ర్ ఆడిన ఫ‌స్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్‌. అయితే ఆ ప్లేయ‌ర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ త‌ర్వాత ప‌రిస్థితిపై ఐదు అంకెల మొత్తం బెట్టింగ్ న‌డిచిన‌ట్లు తేలింది. క‌చ్చితంగా ఫ‌లితం కూడా అలాగే వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో స‌ర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ న‌డిచాయి. ఈ రెండు మ్యాచ్‌ల‌పై ఐటీఐఏ విచార‌ణ జ‌రుపుతోంది.


Tags

Read MoreRead Less
Next Story