RaviTeja: మాస్ మహరాజా చిత్రంలో ఐటెం సాంగ్‌కి ఓటేసిన బ్యూటీ..
RaviTeja : ముందుగా అనసూయ నటిస్తుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది.

Ravi Teja: ఐటెం సాంగ్‌కి అర్థం మారిపోయింది.. సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్లు ఐటెం సాంగ్‌కి అర్థం మార్చేశారు.. స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చి ఐటెం సాంగ్ చేయించేస్తున్నారు.. దాంతో ఆ సినిమాకి క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో ఊ అంటావా పాటకు సమంత డ్యాన్స్ చేయడంతో ఆ చిత్రం ఇమేజ్ ఓ రేంజ్‌లో పెరిగింది. పారితోషికం కూడా బాగానే అందుతుందేమో.. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.. డబ్బుతో పాటు పేరు కూడా వస్తుండడంతో ఓటేసేస్తున్నారు నాయకీమణులు.
తాజాగా మాస్ మహరాజా రవితేజ.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న 'ధమాకా' చిత్రంలో ఆర్‌ఎక్స్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఓ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు టాక్. ముందుగా అనసూయ నటిస్తుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది.
పాయల్ నటిస్తున్న విషయాన్ని కూడా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కాగా, త్రినాధ్ మొదట ఈ స్క్రిప్ట్‌ను విక్టరీ వెంకటేష్‌కి వినిపించారట. కానీ సీనియర్ హీరో ఇప్పటికే తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున త్రినాథ్ చిత్రానికి డేట్స్ ఇవ్వలేకపోయారట. దాంతో డైరెక్టర్ కథను రవితేజకు వినిపించారట. అతడు వెంటనే ఓకే చేయడంతో సినిమా పట్టాలెక్కింది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
RELATED STORIES
ICF Railway Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో ఇంటిగ్రల్ కోచ్...
29 Jun 2022 6:30 AM GMTATC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్...
28 Jun 2022 5:00 AM GMTBIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యూరో ఆఫ్ ఇండియన్...
27 Jun 2022 4:46 AM GMTIndian Air Force Recruitment 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ...
25 Jun 2022 4:55 AM GMTBank of Baroda Recruitment 2022: డిగ్రీ, పీజీ అర్హతతో బ్యాంక్ ఆఫ్...
24 Jun 2022 5:17 AM GMTIndia Post recruitment 2022: 8వ తరగతి అర్హతతో ఇండియా పోస్ట్ లో ...
23 Jun 2022 5:04 AM GMT