Anupama Parameswaran: బర్త్‌డే బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. అప్‌కమింగ్ తెలుగు చిత్రాలివే..
Anupama Parameswaran: ఇటీవల విడుదలయిన ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అనుపమ లిప్ లాక్ సీన్స్ పెద్ద సెన్సేషన్నే సృష్టించాయి.

Anupama Parameswaran: మలయాళం నుండి వచ్చిన ఎంతోమంది ముద్దుగుమ్మలు టాలీవుడ్లో తమ సత్తాను చాటుకుంటున్నారు. అందులో ఒకరు అనుపమ పరమేశ్వరన్. ఈరోజు ఈ మలయాళ కుట్టి తన 26వ ఏట అడుగుపెడుతోంది.
మలయాళ సినిమాలంటే తెలుగువారికి ఎప్పటినుండో ఇష్టమే. అసలు మలయాళ చిత్రాలు ఎలా ఉంటాయి అని మనకు పరిచయం చేసిన అతికొద్ది సినిమాలలో 'ప్రేమమ్' కూడా ఒకటి. ఆ ప్రేమమ్‌లోని మేరి పేరుతో అందరినీ కట్టిపడేసింది అనుపమ.
ప్రేమమ్ సినిమా కేవలం మలయాళంలోనే విడుదల అయినా.. ఆ మూవీ మాత్రం అనుపమను అన్ని భాషా ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ప్రేమమ్‌లో అనుపమను చూసి ఇంప్రెస్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తనను 'అఆ' సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఎంపిక చేశాడు.
'శతమానం భవతి' చిత్రంతో టాలీవుడ్లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్.
ఆ తర్వాత తెలుగులోని యంగ్ హీరోలతో వరుసగా జోడీకట్టడం మొదలుపెట్టింది అనుపమ.
తెలుగులో కొంతకాలం బిజీగా గడిపేసిన తర్వాత అనుపమకు మళ్లీ మలయాళం నుండి పిలుపు వచ్చింది.
ప్రస్తుతం ఇటు తెలుగు, అటు మలయాళం సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ బిజీగా గడిపేస్తోంది అనుపమ.
ప్రస్తుతం అనుపమ తెలుగులో మూడు సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.
సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా వస్తున్న '18 పేజీస్'లో అనుపమనే హీరోయిన్.
ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ అయిన 'కార్తికేయ 2'లో అనుపమనే హీరోయిన్గా సెలక్ట్ చేశారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హెలెన్' సినిమా తెలుగు రీమేక్‌లో అనుపమనే హీరోయిన్గా నటిస్తోంది.
ఇటీవల విడుదలయిన 'రౌడీ బాయ్స్' చిత్రంలో అనుపమ లిప్ లాక్ సీన్స్ పెద్ద సెన్సేషన్నే సృష్టించాయి.
RELATED STORIES
Producers Guild: నాని, నితిన్‌లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTSurekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
13 Aug 2022 12:00 PM GMTNamrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర...
13 Aug 2022 11:15 AM GMTPavan Tej Konidela: పెళ్లి చేసుకోనున్న కొణిదెల వారసుడు.. హీరోయిన్‌తో...
13 Aug 2022 10:24 AM GMTNaga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే అలా చేస్తానంటున్న చైతూ..
11 Aug 2022 5:20 AM GMTPoorna: పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి..
11 Aug 2022 2:12 AM GMT