5 Aug 2022 12:56 PM GMT

Home
 / 
Photo Gallery / Kajol: కాజోల్ బర్త్ డే...

Kajol: కాజోల్ బర్త్ డే స్పెషల్.. అజయ్ దేవగన్‌తో ప్రేమ ఎలా మొదలయ్యిందంటే..?

Kajol: దివ్య భారతి హఠాన్మరణంతో తను చేయాల్సిన ‘హల్‌చల్’ చిత్రం కాజోల్ చేతికి వచ్చింది.

Kajol: కాజోల్ బర్త్ డే స్పెషల్.. అజయ్ దేవగన్‌తో ప్రేమ ఎలా మొదలయ్యిందంటే..?
X

Kajol: బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ క్వీన్ కాజోల్.. నేడు తన 48వ ఏట అడుగుపెడుతోంది. దీంతో బీ టౌన్‌లో తనకు విషెస్ వెల్లువెత్తాయి.


స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే 'బేఖుదీ' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కాజోల్.


కెరీర్ మొదట్లోనే 'గుప్త్' అనే చిత్రంలో విలన్ పాత్ర పోషించింది.


షారుఖ్ ఖాన్‌తో కాజోల్ జోడీ సూపర్ హిట్. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్‌షిప్ కూడా చూసి కాజోల్, షారుఖ్ పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారంతా.


కానీ దివ్య భారతి హఠాన్మరణంతో తను చేయాల్సిన 'హల్‌చల్' చిత్రం కాజోల్ చేతికి వచ్చింది. ఆ సినిమా సెట్‌లోనే అజయ్ దేవగన్‌ను కలిసి తనతో ప్రేమలో పడింది.


అజయ్‌ను పెళ్లి చేసుకోవడానికి మొదట కాజోల్ తండ్రి ఒప్పుకోలేదట. అంతే కాకుండా వారం రోజులు మాట్లాడకుండా ఉన్నారట. కానీ చివరికి కాజోల్ ఇష్టాన్ని ఆయన కూడా కాదనలేకపోయారు.


ఇక కాజోల్ కెరీర్ విషయానికి వస్తే.. హిందీ సినిమాలతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా కాజోల్ మెరిసింది.


చాలాకాలం గ్యాప్ తర్వాత ధనుష్ నటించిన 'వీఐపీ 2'లో కాజోల్ విలన్‌గా నటించింది.


ప్రస్తుతం ఓటీటీల్లో పలు వెబ్ సిరీస్, చిత్రాలతో కాజోల్ బిజీగా ఉంది.


ప్రస్తుతం తను నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌కు ఒక్క ఎపిసోడ్ కోసం కాజోల్ రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story