Krithi Shetty: ఒక్క సినిమా చాలు.. హీరోయిన్ ఫేట్ మారిపోవడానికి. కానీ కొందరికి మాత్రం మొదటి సినిమా నుండే టాలెంట్‌తో పాటు లక్ కూడా కలిసొస్తుంది. కృతి శెట్టికి కూడా అలాగే జరిగింది. కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. అలా పరిచయమయిన వెంటనే పెద్ద స్టార్ అయిపోయింది. ఉప్పెన విడుదల తర్వాత ఎంతోమంది దర్శక, నిర్మాతలు ఈ బేబమ్మ డేట్స్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక కృతి రెండో చిత్రంగా ఇటీవల విడుదలయ్యింది 'శ్యామ్ సింగరాయ్'. శ్యామ్ సింగరాయ్ విడుదలయ్యి ఒక నెల పూర్తి కాకుండానే కృతి నటించిన మరో సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమాలో మొత్తం ఎనిమిదిమంది హీరోయిన్లు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. బంగార్రాజులో నాగచైతన్యకు జోడీగా నటిస్తుంది కృతి శెట్టి. బంగార్రాజు చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి నాగలక్ష్మి అనే పాత్రను పోషిస్తోంది.