16 Nov 2021 3:50 PM GMT

Home
 / 
Photo Gallery / Pooja Hegde:...

Pooja Hegde: మాల్దీవుల్లో పూజా హెగ్డే.. స్విమ్ సూట్‌లో హాట్‌గా..

Pooja Hegde: సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం షూటింగ్ నుండి కాస్త ఖాళీ సమయం దొరకగానే హాలిడేస్‌కు చెక్కేస్తున్నారు.

Pooja Hegde (tv5news.in)
X

Pooja Hegde (tv5news.in)

Pooja Hegde: సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం షూటింగ్ నుండి కాస్త ఖాళీ సమయం దొరకగానే హాలిడేస్‌కు చెక్కేస్తున్నారు. ముఖ్యంగా అందులోనూ అందరూ మాల్దీవులకే వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా పూజా హెగ్డే కూడా హాలిడే అనగానే మాల్దీవుల్లో వాలిపోయింది. తన లేటెస్ట్ ఫోటోస్‌తో టెంపరేచర్‌ను పెంచేస్తోంది.ప్రభాస్‌తో రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తోంది పూజా. ఇటీవల ఈ సినిమా నుండి 'ఈ రాతలే' అనే పాట కూడా విడుదలయింది.


తెలుగుతో పాటు తమిళంలో కూడా బిజీ అవ్వాలని పూజా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'బీస్ట్' చిత్రంలో ఆమె నటిస్తోంది.


చివరిగా పూజా, అక్కినేని అఖిల్ జంటగా నటించిన 'మెస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్' డీసెంట్ హిట్‌ను అందుకుంది. ఇక త్వరలోనే ఆ సినిమా ఆహాలో విడుదల కానున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది.తెలుగులో రాధే శ్యామ్‌తో పాటు చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టారర్ 'ఆచార్య'లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది పూజా హెగ్డే.


ఆచార్య సినిమాలో నీలాంబరిగా కనిపించనుంది పూజా. ఇక ఇటీవల తన పేరు మీద ఉన్న ఒక మెలోడి పాటను ఆచార్య టీమ్ విడుదల చేసింది.


తెలుగు, తమిళంలోనే కాదు హిందీలో కూడా అప్పుడప్పుడు తన లక్‌ను పరీక్షించుకుంటోంది పూజా.


ప్రస్తుతం పూజా.. హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటిస్తున్న 'సర్కస్' సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.Next Story