Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్‌కమింగ్ మూవీ అప్డేట్ రిలీజ్..
Sai Pallavi: మొదటి సినిమా నుండే తనలో యాక్టింగ్ కెపాసిటీ ఎంతుందో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసింది పల్లవి.

Sai Pallavi: సినీ పరిశ్రమలో గ్లామర్‌తో కాకుండా అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది సాయి పల్లవి. మే 9న సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ అప్డేట్ బయటికొచ్చింది.
మలయాళ సినిమాలకు అంత పాపులారిటీ లేని సమయంలో వచ్చి.. సౌత్ ఇండస్ట్రీ అంతా తనవైపు తలెత్తి చూసేలా చేసింది 'ప్రేమమ్'. ఈ సినిమా ద్వారానే సాయి పల్లవి ప్రేక్షకులకు పరిచయమయ్యింది. మలర్ పాత్రలో మ్యాజిక్ చేసింది సాయి పల్లవి.
మొదటి సినిమా నుండే తనలో యాక్టింగ్ కెపాసిటీ ఎంతుందో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసింది పల్లవి.
గ్లామర్ పాత్రలకు, కమర్షియల్ సినిమాలకు తాను దూరంగా ఉంటానని.. కెరీర్ మొదట్లోనే స్పష్టం చేసింది సాయి పల్లవి.
ఇక 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా నటించింది.
సాయి పల్లవి చేసే ప్రతీ పాత్ర పేరుతో సహా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. యాక్టింగ్‌తో తను క్రియేట్ చేసే మ్యాజిక్ అలాంటిది.
సాయి పల్లవి నటించిన సినిమాలు కమర్షియల్‌గా హిట్ అవ్వకపోయినా తాను మాత్రం ఆ క్యారెక్టర్లో తన బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది.
ఇక సాయి పల్లవి చివరిగా నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో మెరిసింది. ఇందులో దేవదాసిగా సాయి పల్లవి యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.
రానాతో కలిసి సాయి పల్లవి నటించిన 'విరాటపర్వం' విడుదలకు సిద్ధంగా ఉంది.
తన పుట్టినరోజు సందర్భంగా తన తరువాతి సినిమా అప్డేట్ను రిలీజ్ చేసింది సాయి పల్లవి. తాను గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో 'గార్గి' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
RELATED STORIES
Vinod Kambli: కష్టాల్లో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి.. సాయం కోసం...
18 Aug 2022 3:00 PM GMTYuzvendra Chahal: విడాకులు తీసుకోనున్న క్రికెట్ కపుల్..? సోషల్...
18 Aug 2022 2:45 PM GMTDhanashree Verma: 'రారా రెడ్డి' పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ భార్య.....
10 Aug 2022 4:05 AM GMTAsia Cup 2022: యూఏఈలో ఆసియా కప్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమిండియా..
3 Aug 2022 10:15 AM GMTAsia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! ఆసియా కప్ 2022...
2 Aug 2022 3:45 PM GMTMithali Raj: 'అలా జరిగితే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తా'.. మిథాలీ ప్రకటన
26 July 2022 1:50 AM GMT