Photo Gallery

Suhana Khan: రెడ్ శారీలో షారుఖ్ కూతురు.. హీరోయిన్ కళ కనిపిస్తుందిగా..!

Suhana Khan: షారుఖ్ కూతురు సుహానా ఖాన్ లేటెస్ట్ ఫోటోషూట్ కూడా వైరల్‌గా మారుతోంది.

Suhana Khan: రెడ్ శారీలో షారుఖ్ కూతురు.. హీరోయిన్ కళ కనిపిస్తుందిగా..!
X

Suhana Khan: బాలీవుడ్‌లో కింగ్ ఖాన్‌గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్.. త్వరలోనే తన ఇద్దరు పిల్లలను ప్రేక్షకులకు పరిచయం చేసే పని మొదలుపెట్టేశాడు. దానికి తగినట్టుగా షారుఖ్ కూతురు సుహానా ఖాన్ లేటెస్ట్ ఫోటోషూట్ కూడా వైరల్‌గా మారుతోంది.


షారుఖ్ ఖాన్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా.. తన ఫ్యామిలీని కూడా తనతో పాటు తీసుకెళ్లేవాడు. అలా తన కొడుకు ఆర్యన్ ఖాన్, కూతురు సుహానా గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసింది.


సుహానా ఖాన్ చదువంతా ఫారిన్‌లోనే జరిగింది.


ఎప్పటినుండో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని సుహానా మాత్రమే కాదు షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కూడా కోరుకుంటోంది.


బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ జోయా అక్తర్ చేతుల మీదుగా సహానా ఖాన్ ఇంట్రడ్యూస్ కానుంది.


నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ వెబ్ మూవీతో సుహానా హీరోయిన్‌గా పరిచయం కానుంది.


ఈ వెబ్ మూవీకి 'ది ఆర్చీస్‌' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్టు సమాచారం.


షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ అమెజాన్‌లో ఓ వెబ్ సిరీస్‌తో రైటర్‌గా పరిచయం అవుతుండగా.. సుహానా మాత్రం ఏకంగా హీరోయిన్‌గానే ఎంట్రీ ఇచ్చేస్తోంది.


షారుఖ్ పిల్లలు ఇద్దరూ ఓటీటీలోనే ఇంట్రడ్యూస్ అవ్వడం విశేషం.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES