న్యూజెర్సీ... తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రేవంత్‌రెడ్డి

న్యూజెర్సీ... తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రేవంత్‌రెడ్డి

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. ఆయనకు JKF ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలికారు అభిమానులు.రేవంత్‌ తో పాటు హర్యానా నేత,రాజ్యసభ సభ్యుడు దిపేందర్‌హుడా కూడా అమెరికా వెళ్లారు.

న్యూజెర్సీలో ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. భారత ప్రవాసీ కాంగ్రెస్‌ ఈ వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రేవంత్‌ రెడ్డి అమెరికా చేరుకున్నారు.

తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ కృషి, ప్రస్తుతం తెలంగాణ పరిస్థితిపై ఆయన ప్రసంగించనున్నారు. జూన్‌ 4న న్యూయార్క్‌ నగరంలో జాకబ్‌ జావిట్‌ సెంటర్‌లో భారత ప్రవాసీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 5వేల మందితో బహిరంగ సభ జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు.

Tags

Next Story