ఏడాది చివరికే నానీ సినిమా ...!

ఏడాది చివరికే నానీ సినిమా ...!

దసరా సినిమా సక్సెస్ తో మాంచి ఊపు మీదు ఉన్న నేచురల్ స్టార్ నానీ, తన ౩౦వ సినిమాతో మళ్లీ ఈ ఏడాది చివరిలోనే కలుస్తానంటూ కబురందించాడు. వైరా ఎంటర్టైర్మెంట్స్ పతాకంపై శౌర్యా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నానీకి జోడీగా మన అందాల సీత మృణాల్ ఠాకుర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల ో నానీ ఓ ఎనిమిదేళ్ల చిన్నారికి తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంది. మరి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న నానీ౩౦ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూాడాలి.Next Story