
By - Vijayanand |16 April 2023 6:18 PM IST
కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదంలో నీరజారెడ్డి కన్నుమూశారు. ఆమె హైదరాబాద్ నుంచి వెళ్తుండగా బీచుపల్లి దగ్గర టైర్ పగిలి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నీరజారెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి నీరజారెడ్డి ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com