
By - Chitralekha |19 April 2023 1:18 PM IST
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను మరోసారి దక్షిణాది ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాలతో నటిగా తెరంగేట్రం చేసినా, అక్కడ నటిగా సంతృప్తిని పొందలేకపోయానని చెప్పింది. ఈ కారణంగానే తాను బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యానని తెలిపింది. పింక్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, బాలీవుడ్‌లో తాను చేసిన పాత్రల పట్ల సంతృప్తిగా ఉన్నానని తాప్సీ చెప్పింది. ఎవరూ సాధించలేని స్థితికి చేరుకోవడమే తన ధ్యేయమని చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సౌత్ ఫిల్మ్ సర్కిల్స్‌లో మళ్లీ దుమారం రేపుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com