
అన్ని హంగులు సమకూర్చుకున్న తెలంగాణ కొత్త సచివాలయానికి బీఆర్కే భవన్ నుంచి షిఫ్టింగ్ ప్రారంభమయ్యింది. ఈనెల 30న నూతన సచివాలయం ప్రారంభం తర్వాత.. అదే రోజు నుంచి కొత్త సచివాలయం నుంచి పాలన షురూ కానుంది. ఇవాళ్టి నుంచి కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ మొదలు పెట్టారు. 28వ తేదీ వరకు షిఫ్టింగ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖలను కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెవెన్యూ శాఖ.. మొదటి ఫ్లోర్‌లో హోమ్ శాఖ.. రెండో అంతస్తులో ఆర్థిక శాఖ.. మూడో ఫ్లోర్‌లో అగ్రికల్చర్, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖలు.. నాలుగో అంతస్తులో ఇరిగేషన్, న్యాయ శాఖలు.. ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ... ఆరో ఫ్లోర్‌లో సీఎం, సీఎస్ కార్యాలయాలు ఉండనున్నాయి. ఇప్పటికే శాఖలవారీగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com