థానేలో కుప్పకూలిన పాత భవనం

థానేలో కుప్పకూలిన పాత భవనం

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో రెండంతస్తుల గోడౌన్ కుప్పకూలింది. ఈ ఘటన శనివారం జరిగింది. గోడౌన్ కూలడంతో దాని పక్కనే నివసిస్తున్న వాళ్లు, అందులో పనిచేస్తున్నవాళ్లు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం, పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ అవినాష్ సావంత్ సంఘటన జరిగిన మంకోలిలోని వల్పాడ ప్రాంతాన్ని సందర్శించారు. రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపారు.Next Story