ద్వారకా తిరుమలలో భారీ వర్షం..తీవ్ర ఇబ్బందుల్లో స్వామివారి దర్శనం

ద్వారకా తిరుమలలో భారీ వర్షం..తీవ్ర ఇబ్బందుల్లో స్వామివారి దర్శనం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. చిన తిరుమలగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో భారీ వర్షం కురిసింది. ద్వారకా తిరుమల్లో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపధ్యంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. వెంకన్నను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడం, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం కావడంతో వర్షంలోనే తడుస్తూనే దర్శనం చేసుకున్నారు భక్తులు. క్యూలైన్ల లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘాట్‌ రోడ్డుకు ఇరువైపులా వరద ప్రవాహం పెరగడంతో ద్వారకా తిరుమల గ్రామం నీట మునిగింది.

Next Story