మొత్తానికి చిక్కాడు

మొత్తానికి చిక్కాడు

హైదరాబాద్‌కు చెందిన గ్యాంబ్లర్‌ చీకోటి ప్రవీణ్ థాయ్‌ పోలీసులకు చిక్కాడు. థాయ్‌ల్యాండ్‌ పోలీసులు అతి పెద్ద గ్యాంబ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించారు. పటాయాలోని ఆసియా హోటల్‌లో నిన్న రాత్రి నిర్వహించిన దాడుల్లో... గ్యాంబ్లింగ్‌ ఆడుతున్న 97 మంది పోలీసులు పట్టుబడ్డారు. వీరిలో 80 మంది భారతీయులే అని పోలీసులు వెల్లడించారు. ఇందులో గ్యాంబ్లర్‌ చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. వీరిందరూ కేవలం గ్యాంబ్లింగ్ కోసమే థాయ్‌కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్యాసినోలో దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు.


Next Story