సచివాలయం వద్ద టెన్షన్.. రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు

సచివాలయం వద్ద టెన్షన్.. రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సచివాలయానికి బయల్దేరిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై రేవంత్ ఫైరయ్యారు. అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ 30 ఏళ్ల లీజులో అక్రమాలు జరిగాయని తొలి నుంచి రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇందులో బాగంగానే మున్సిపల్ అడ్మిననిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌ కుమార్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న రేవంత్ ని పోలీసులు అడ్డుకున్నారు.

Next Story