పాక ఇడ్లీ పై మాజీ ఉప రాష్ట్రపతి మమకారం

పాక ఇడ్లీ పై మాజీ ఉప రాష్ట్రపతి మమకారం

విజయవాడలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ట్రిపుల్ ఎస్ ఇడ్లీ సెంటర్‌లో టిఫిన్ చేశారు. మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి పాక ఇడ్లీ తిన్నారు. ట్రిపుల్ ఎస్ ఇడ్లీ సెంటర్‌లో ఇడ్లీ తినేందుకు ప్రత్యేకంగా గన్నవరం నుంచి విజయవాడ వచ్చిన వెంకయ్యనాయుడు.. నాణ్యమైన ఇడ్లీ అందిస్తున్నారని హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్‌ను అభినందించారు. సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని తెలిపారు.

Next Story