నెమళ్ల మృత్యువాత

నెమళ్ల మృత్యువాత

సిద్దిపేట జిల్లా చేర్యాలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో.. నెమళ్ల మృతి కలకలం రేపింది. వ్యవసాయ పొలాలలో 20కి పైగా నెమళ్లు మృత్యువాత పడ్డాయి. వీటిని గమనించిన స్థానిక రైతు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు.. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. మృతి చెందిన నెమళ్లను ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా.. వాటికి పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను ల్యాబ్‌కి పంపించారు. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత నెమళ్ల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విష గుళికలతో నెమళ్లను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story