భగ్గుమన్న మణిపూర్

భగ్గుమన్న మణిపూర్

మణిపూర్ లో షెడ్యూల్డ్ తెగల కోసం నిర్వహించిన ర్యాలీ హింసకు దారితీసింది. అల్లర్లను నిలువరించడానికి ఆర్మీ, అస్సాం రైఫిల్స్ రంగంలోకి దిగింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. బుధవారం గిరిజనుల ఆందోళన సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మొత్తం మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. వివిధ జిల్లాల్లో సెక్షన్ 144 CrPC కింద కర్ఫ్యూను విధించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు.

Next Story