కాశ్మీర్ లో కుప్పకూలిన ఆర్మీ హెలీకాఫ్టర్

కాశ్మీర్ లో కుప్పకూలిన ఆర్మీ హెలీకాఫ్టర్

జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా, మార్వా తహసీల్‌లోని మచ్చ్నా గ్రామ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోగా... ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో ముగ్గురు జవాన్లు ఉన్నారు. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లకు గాయాలవగా.. వారు సురక్షితంగా ఉన్నారు.

Next Story