జగన్ సర్కారు మొద్దు నిద్ర

జగన్ సర్కారు మొద్దు నిద్ర

రైతుల చేతికి పంట వచ్చిన దశలో వర్షాలు విరుచుకుపడ్డాయి. రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. అమ్ముకోవాలన్నా కొనే నాథుడు లేరు. పంట కోసిన తర్వాత సంభవించే నష్టానికి సాయం అందించలేమని, నిబంధనలు వర్తించవని అధికారులు అంటున్నారు. ఇక అకాల వర్షాలతో ఎంత నష్టం ఏర్పడింది అన్న అంచనా కూడా వేయలేకపోయింది జగన్‌ సర్కార్‌. రైతులకు భరోసా ఇచ్చేందుకు కనీసం ఒక్క ప్రకటన చేయడం లేదు. రైతులకు ఇలాంటి సమయాల్లో ధైర్యం చెప్పే వారు కావాలి. అలాంటి పరిస్థితే అంతకంతకూ కరువవుతోంది. మొద్దు నిద్ర పోతున్న సర్కార్‌ నిద్ర లేచేదెప్పుడు.. సాయం చేసేది ఎప్పుడు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story