ఖార్గే హత్యకు బీజేపీ కుట్ర: రణదీప్‌ సూర్జేవాల

ఖార్గే హత్యకు బీజేపీ కుట్ర: రణదీప్‌ సూర్జేవాల

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హత్యకు బీజేపీ నేతలు కుట్ర పన్నారంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాల సంచలన ఆరోపణలు చేశారు. ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని అంతం చేసేందుకు బీజేపీ నేతలు వ్యూహం పన్నారన్నారు. చిట్టాపూర్‌ బీజేపీ అభ్యర్థి మణికంఠదిగా చెబుతూ ఓ ఆడియో కూడా మీడియా సమావేశంలో విన్పించారు. మణికంఠపై 40కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ, సీఎం బొమ్మై కనుసన్నల్లోనే ఖర్గే హత్యకు వ్యూహ రచన జరిగిందని సూర్జేవాలా తీవ్ర ఆరోపణలు చేశారు.

Next Story