ఎట్టకేలకు విడాకులపై స్పందించిన నాగ చైతన్య

ఎట్టకేలకు విడాకులపై స్పందించిన నాగ చైతన్య

కస్టడీ ప్రమోషన్స్‌లో పాల్గొంటోన్న నాగచైతన్య సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. "అవును. మేం విడిపోయి రెండేళ్లు దాటింది, అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది దాటింది. కోర్టు మాకు విడాకులు మంజూరు చేసింది. మేమిద్దరం మా జీవితాలను కొనసాగిస్తున్నాం. నా జీవితంలో ఆ దశ పట్ల నాకు విపరీతమైన గౌరవం ఉంది అని చైతూ చాలా హూందాగా స్పందించాడు. అయితే మీడియా తనకు, సమంతకు మధ్య విషయాలను చాలా ఇబ్బందికరంగా మార్చిందని తెలిపాడు. మీడియా ఊహాగానాలతో మా మధ్య విషయాలు ఇబ్బందికరంగా మారాయి. ప్రజల దృష్టిలో, పరస్పర గౌరవం తొలగిపోతుంది. దాని గురించి నేను బాధపడ్డాను" అని చైతన్య వివరించాడు.

Next Story