టెక్సాస్ కాల్పుల్లో తెలుగు యువతి మృతి

టెక్సాస్ కాల్పుల్లో తెలుగు యువతి మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. తాటికొండ ఐశ్వర్య అనే తెలంగాణ అమ్మాయి చనిపోయింది. టెక్సాస్‌లోని షాపింగ్‌ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోగా అందులో తాటికొండ ఐశ్వర్య ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి నర్సిరెడ్డి కుమార్తె తాటికొండ ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం టెక్సాస్‌కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఐశ్వర్య మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Next Story