ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. ఇది ప్రస్తుతం తమిళనాడుకు ఆనుకుని దక్షిణ అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది.. రానున్న 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది.. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫానుగా మారుతుందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.. ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిసే ప్రభావం ఉందని అధికారులు చెప్పారు. అయితే, తుఫాన్‌ కోస్తాకు దూరంగా ప్రయాణించే నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం లేదని అంటున్నారు.. రానున్న ఐదారు రోజుల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.

Next Story