అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం, తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. సాయంత్రానికి ఉత్తర వాయువ్య దిశగా కదిలి, తీవ్ర తుఫానుగా మారుతుందని హెచ్చరించారు. మే 14న అగ్నేయ బంగ్లాదేశ్‌ మరియు, ఉత్తర మయన్మార్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్రలో ఎండల తీవ్రతతో పాటు, వడగాల్పులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40డిగ్రీల వరకూ నమోదవుతాయంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద.

Next Story