కేసీఆర్ మాటను లెక్కచేయని మిల్లర్లు... రైతుల ఆందోళన

కేసీఆర్ మాటను లెక్కచేయని మిల్లర్లు... రైతుల ఆందోళన

వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంత గ్రామంలో రైతులు ఆందోళనబాట పట్టారు. సీఎం కేసీఆర్‌ చెప్పినా తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. తరుగు పేరుతో మిల్లర్లు దోచుకు తింటున్నారంటూ వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. రైతుల ధర్నాకు అఖిలపక్షం నేతలు కూడా మద్దతు తెలిపారు. రైతుల నిరసనలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పి ధర్నా కార్యక్రమాన్ని విరంపజేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Next Story