
By - Chitralekha |15 May 2023 4:03 PM IST
అంబులెన్స్‌కు రూ.8000 చెల్లించలేని కారణంగా, చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని తండ్రి బస్సులో ఇంటికి రావాల్సి వచ్చిన హృదయవిదారక ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. దినాజ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి డబ్బు లేకపోవడంతో అంబులెన్స్‌ని తీసుకోలేకపోయాడు. ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో ఉంచి కాలియాగంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం అయింది. దీనిపై ప్రతిపక్ష నేత శుభేందు అధికారి మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com