
By - Chitralekha |16 May 2023 12:40 PM IST
హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో గంధం చెట్ల అపహరణ కలకలం సృష్టిస్తోంది. గతంలో 10 గంధపు చెట్లను నరికి అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. మళ్లీ అదే బాటలో చెట్లుకు గాట్లు పెట్టి మరీ వెళ్లారు దుండగులు. దాదాపు 8 చెట్లకు గాట్లు పెట్టడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందిరాపార్క్ మేనేజర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాట్లు పెట్టిన చెట్లు చనిపోకుండా ఉండేందుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com