
By - Chitralekha |16 May 2023 4:04 PM IST
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, ఓ వ్యక్తి తన బిడ్డను డయాస్‌పైకి విసిరేసిన ఘటన కలకలం సృష్టించింది. జనం గుంపుల మధ్య పిల్లాడు వేదికకు ఒక అడుగు దూరంలో పడిపోయాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ చిన్నారిని తల్లికి అప్పగించారు. అయితే గుండెకు రంధ్రం ఉన్న తన చిన్నారిని రక్షించాలనే తపనతోనే తండ్రి ఈ చర్యలు పాల్పడ్డాడని తెలుస్తోంది. అతడు ఆశించినట్లుగానే సీఎం చిన్నారికి సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే చిన్నారికి శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com