కొలంబియాలో వింత ఘటన

కొలంబియాలో వింత ఘటన

కొలంబియాలో దట్టమైన అడవిలో విమానం కూలిపోయిన ఘటనలో రెండు వారాల తర్వాత నలుగురు చిన్నారులు సజీవంగా లభ్యమయ్యారు. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటన చేశారు. మే 1న జరిగిన విమాన ప్రమాదంలో ఈ చిన్నారుల ఆచూకీ గల్లంతు అయింది. వీరందరూ తోబుట్టువులే కాగా, వీరిలో 11 నెలల పసికందు సహా, 4, 9ఏళ్ల వయసుగల అబ్బయిలతో పాటూ, 12ఏళ్ల వీరి పెద్దక్క ఉంది. ప్రమాదంలో పైలట్‌తో సహా ముగ్గురు పెద్దలు మరణించగా, వారి మృతదేహాలు విమానంలోనే లభ్యమయ్యాయి. అడవిలో అర్థరాత్రి పూట చిన్నారులు సురక్షితంగా ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

Next Story