జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచాలి..ప్రభుత్వం ఆదేశాలు

జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచాలి..ప్రభుత్వం ఆదేశాలు

జీవోలను ఆన్‍లైన్‍లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ గెజిట్ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్‍లో ఉంచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టర్‍లో నమోదైన అన్ని జీవోలనూ వెబ్‍సైట్‍లో అప్‍లోడ్ చేయాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఇచ్చిన జీవోలను అప్‍లోడ్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ గెజిట్ వెబ్‍సైట్ లో అప్‍లోడ్‍కు అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు వెల్లడించింది.

Next Story