సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించారు..ఇషితా కిషోర్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. గరిమ లోహియా సెకండ్‌ ర్యాంక్‌, ఉమా హారతి మూడో ర్యాంక్‌, స్మృతి మిశ్రా నాలుగో ర్యాంక్‌ సాధించారు.

తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకు సాధించారు.. శాఖమూరి శ్రీసాయి అశ్రిత్‌ 40వ ర్యాంకు, సాయి ప్రణవ్‌ 60వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నిధి పాయ్‌ 110వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157వ ర్యాంకు సాధించగా.. కమతం మహేశ్‌కుమార్‌ 200వ ర్యాంకు గెలుచుకున్నారు. రావుల జయసింహారెడ్డి 217, విశాఖకు చెందిన సాహిత్య 243కు ర్యాంకు వచ్చింది. అంకుర్‌ కుమార్‌కు 257వ ర్యాంకు, బొల్లం ఉమామహేశ్వర రెడ్డికి 270వ ర్యాంకు, చల్లా కళ్యాణికి 285వ ర్యాంకు, పాలువాయి విష్ణువర్ధన్‌ రెడ్డికి 292వ ర్యాంకు, గ్రంధె సాయికృష్ణకు 293వ ర్యాంకు వచ్చింది.

Next Story