రూ. 1,070 కోట్లతో నిలిచిపోయిన ట్రక్కు

రూ. 1,070 కోట్లతో నిలిచిపోయిన ట్రక్కు

రిజర్వ్ బ్యాంకుకు చెందిన రూ. 1,070 కోట్ల నగదును తరలిస్తోన్న ట్రక్కులో సాంకేతికలోపం ఏర్పడటంతో రోడ్డుపైనే నిలిచిపోయిన ఘటన చైన్నైలో చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురానికి నగదును తరలిస్తుండగా తాంబరంలో ట్రక్కు నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై 17 మంది పోలీసులు వాహనానికి రక్షణగా నిలిచారు. తాంబరం అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కును సిద్ధా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అక్కడికి బయట వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేదించారు. రిపేరు సాధ్యమవ్వకపోవడంతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌కు ట్రక్కును తిరిగి పంపించారు.

Next Story