కింగ్‌ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి భారీ ఏర్పాట్లు

కింగ్‌ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి భారీ ఏర్పాట్లు

కింగ్‌ ఛార్లెస్-3 పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రిటన్‌లో పట్టాభిషేకం జరుగుతోంది. వెస్ట్ మినిస్టర్ అబేలోని బకింగ్ హమ్ ప్యాలెస్​లో అత్యంత ఆడంబరంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. పట్టాభిషేకంలో కిరీటంతో పాటు ఇతర ఆభరణాలన్నీ కలిపి సుమారు 100 దాకా ఉంటాయి. వీటి విలువ 300 కోట్ల నుంచి 500 కోట్ల పౌండ్లు ఉంటుందని ఓ అంచనా. అయితే వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాణి కిరీటం లోంచి ప్రతిష్ఠాత్మక కోహినూర్‌ వజ్రాన్ని ఈసారి తొలగించారని తెలుస్తోంది.

Next Story