
By - Chitralekha |22 April 2023 4:10 PM IST
బాలనటిగా తెరంగేట్రం చేసిన అందాల మీనా 1980-90లలో అగ్ర నటిగా వెలుగొందింది. డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణించింది. ఈ క్రమంలో మీనా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 40ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్నిహితులతో కలిసి ఒక వేడుకను నిర్వహించారు. రజనీకాంత్, రాధిక శరత్‌కుమార్, రోజా సెల్వమణి, ఖుష్బూ, స్నేహ, శ్రీదేవి, ప్రభుదేవా, బోనీకపూర్, సంఘవి , మరికొందరు నటీనటులు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మీనా కూతురు ఇచ్చిన స్పీచ్ అతిథులను కంటతడి పెట్టించింది. వేదిక మీద ఉన్న నైనికను రజనీకాంత్ హత్తుకుని నుదుటన ముద్దు పెట్టుకున్నారు. మేమంతా ఉన్నాం అని భరోసా ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com