"నాలుగేళ్లలో 5ఇళ్లు మాత్రమే కట్టిన సీఎం జగన్ "

నాలుగేళ్లలో 5ఇళ్లు మాత్రమే కట్టిన సీఎం జగన్

బనగానిపల్లి నియోజకవర్గం టంగుటూరు గ్రామరైతులు యువనేత లోకేష్ ను కలిసిన తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. నారా లోకేష్ స్పందిస్తూ... వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి రైతాంగాన్ని నట్టేట ముంచారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని చెప్పిన జగన్ నాలుగేళ్లుగా ముఖం చాటేశారని అన్నారు. 30లక్షల ఇళ్లు కడతానని డబ్బాలు కొట్టిన జగన్... నాలుగేళ్లలో 5ఇళ్లు మాత్రమే కట్టారని ఎద్దేవాచేశారు. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే బాధ్యత రాబోయే టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.

Next Story