ఆశాభోంస్లేకు లతా మంగేష్కర్‌ అవార్డు

ఆశాభోంస్లేకు లతా మంగేష్కర్‌ అవార్డు
గతేడాది ఫిబ్రవరి 6న మృతిచెందిన లతా మంగేష్కర్‌ పేరుతో ట్రస్టు,అవార్డును ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు

ఫేమస్‌ సింగర్‌ ఆశాభోంస్లేకు లతా మంగేష్కర్‌ అవార్డు వరించింది. అవార్డును ప్రకటించారు లతా మంగేష్కర్‌ కుటుంబం. గతేడాది ఫిబ్రవరి 6న మృతిచెందిన లతా మంగేష్కర్‌ పేరుతో ట్రస్టు,అవార్డును ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. జాతి నిర్మాణంలో మార్గదర్శక పాత్ర పోషించిన ప్రముఖులకు ఈ అవార్డు ఇవ్వనున్నారు. ఈ అవార్డును గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ స్వీకరించారు. ఈ సంవత్సరం లతాకు స్వయానా సోదరి అయిన ఆశాభోంస్లేకు ఏప్రిల్‌ 24న ఈ పురస్కారం అందజేయనున్నారు. ఇదే వేడుకలో ప్రముఖ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ను మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారంతో సత్కరించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story