
ఉత్తరప్రదేశ్‌లోని షాజాహాన్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్‌పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఓ లారీ ఆగిఉన్న బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు.
శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో భక్తులతో కూడిన బస్సు రాత్రి భోజనం కోసం ఓ దాబా వద్ద ఆగి ఉంది. బస్సులోని కొందరు భోజనం తింటుండగా, మరికొందరు బస్సులో ఉన్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అధి బస్సుపైకి దూసుకురావడంతో 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు. బస్సులో మొత్తం 70 మంది ఉన్నారని, వారంతా ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ నుంచి ఉత్తరాఖండ్‌లోని పూర్ణగిరికి తీర్థయాత్రకు వెళ్తున్నారని చెప్పారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న చాలా మంది సగం నిద్రలో ఉన్నారు. మహిళలు, పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది. వారంతా డంపర్ కింద సమాధి అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com